మొబైల్‌ పోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌: 1,86,000 మోటరిస్టులకి జరీమానా

- July 24, 2020 , by Maagulf
మొబైల్‌ పోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌: 1,86,000 మోటరిస్టులకి జరీమానా

యూ.ఏ.ఈ:గడచిన రెండేళ్ళలో మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసినందుకుగాను 1,86,000 మందికి జరీమానా విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్‌ ఆఫీసర్లు, వివిధ రోడ్లపై అమర్చిన కెమెరాల ద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగిందని చెప్పారు. 2018, 2019లలో ఈ కేసులు నమోదయ్యాయి. 2018లో 89,712 ఉల్లంఘనలు నమోదు కాగా, 2019లో 96,894 ఉల్లంఘనలు నమోదయ్యాయి.ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే 4 బ్లాక్‌ పాయింట్స్‌తోపాటు 800 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువవుతోందనీ, ఈ నేపథ్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com