వారానికి 40 గంటల పనికి అందరు మద్దతు
- February 05, 2016
వారానికి 40 గంటలు పని చేసే విధానానికి సౌదీలు,విదేశీయులు పెద్ద ఎత్తున మద్దత పలుకుతున్నారు.ఈ ప్రతిపాదిత చట్టం మార్పు ప్రకారం ఉద్యోగులు , శ్రామికులు ఇకపై వారంలో 40 పని గంటలు పని చేసి రెండు రోజులు సెలవు పొందేందుకు వీలవుతుంది. ఈ నిర్ణయం అమలులోనికి వస్తే, వారు ఎంతో మెరుగైన శక్తి తో సమర్ధవంతమైన పని చేయగలగడమే కాక ప్రోత్సాహరంగా ఉంటుందని ఈ నూతన సౌదీ కార్మిక చట్టం రూపొందించబడిందని తవునియ సల్లెహ్ బుచయ్ వద్ద సీనియర్ సిస్టం ఇంజినీర్ తెలిపారు, అలాగే , ఉద్యోగులు తగినంత విశ్రాంతి తీసుకోవడం, తమ ప్రియమైన వారితో మరింత సమయాన్ని గడిపేందుకు వీలవుతుంది. వారాంతంలో రెండు రోజుల సెలవులో ఉద్యోగులు, శ్రామికులు బాగా విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఎక్కువ ఉత్పాదకతను, సృజనాత్మకతను వెలికి తీయగలగుతారని ఆయన తెలిపారు. మంగళవారం శౌర కాన్సిల్ ఈ ప్రతిపాదినకు అనుకూలంగా మద్దతు ఇచ్చింది. ఇక తుది నిర్ణయం మంత్రి మండలి తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరగా నిద్ర పోయి...వేకువనే మేల్కోవడం ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యంగా సంపన్నుడిగా , తెలివిగల వ్యక్తిగా రాణించవచ్చని ఆయన అన్నారు. అలాగే , భారతీయ వ్యాపారవేత్త అమీర్ కయ్యమ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ , శౌర కాన్సిల్ నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం కనుక అమలులోనికి వస్తే, మానవ శక్తిని పెద్ద మొత్తంలో ఆదా చేయవచ్చని తన అభిప్రాయాన్ని తెలిపారు.45 ఫిల్లిపైన్స్ సంస్థల కూటమి యొక్క అధినేత సోలార్ గరిఅన్ వ్యాఖ్యానిస్తూ, వారంలో 40 గంటల పని, వారంలో రెండు రోజుల విశ్రాంతి ఉద్యోగ వత్తిడిని తగ్గించడమే కాక ఉద్యోగులు, శ్రామికులు మరింత సమర్ధవంతంగా ఉత్పాదకతను పెంచడానికి కృషి చేస్తారని అన్నారు. వారానికి 40 గంటలు పని చేసే విధానానికి ప్రభుత్వ.ప్రివేతే రంగ సంస్థలు బేషరతుగా మద్దతు పలకడం గమనార్హం.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







