కరోనా నుంచి కోలుకుంటున్న యూఏఈ...
- July 26, 2020
యూఏఈ: యూఏఈ క్రమంగా మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి.శనివారం కూడా 313 కొత్త కేసులు నమోదు కాగా... 393 రికవరీలు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58,562 మంది ఈ వైరస్ బారిన పడితే... 51,628 మంది కోలుకుని ఆస్పత్రి డిశ్చార్జి అయ్యారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 343 మంది మరణించారు.మరోవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు యూఏఈ ముమ్మరంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో 4.5 మిలియన్లకు పైగా కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది.
అలాగే ఆగస్టు నెలాఖరు వరకు 6 మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేయాలని యూఏఈ ఆరోగ్యశాఖ నిర్ణయించుకుంది. అందుకే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కోవిడ్ టెస్టులు చేపడుతోంది.అంతేగాక వ్యాక్సిన్ ట్రయల్స్‌లోనూ మూడో దశకు చేరుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..