కోవిడ్‌ను ట్రాక్ చేసే అత్యాధునిక రిస్ట్ బాండ్
- July 26, 2020
కోవిడ్‌ను ట్రాక్ చేసే అత్యాధునిక రిస్ట్ బాండ్ ను డెవలప్ చేస్తున్నాయి మద్రాస్ IIT,వరంగల్ NIT. ఈ రెండు విద్యాసంస్థలకు చెందిన టెకీలు సంయుక్తంగా దీనిని ఇప్పటికే రూపొందించారు. ప్రస్తుతం తుది ట్రయల్స్ జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ కు కనెక్ట్ అయ్యే ఈ బాండ్.. శరీరంలోని టెంపరేచర్, పల్స్ రేట్, ఆక్సీజన్ శాతాన్ని గుర్తిస్తుంది. సెన్సార్ ద్వారా శరీరంలో వచ్చే మార్పులను గమనించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. అంతేకాదు.. ఇది ఆరోగ్య సేతు యాప్‌తో అనుసంధానం కూడా చేస్తున్నారు. దగ్గరలో కోవిడ్ రోగులు ఉంటే అలర్ట్ కూడా చేస్తుంది. మ్యూజ్ హెల్త్ యాప్ ద్వారా ఇది పనిచేస్తుందని టెకీలు చెబుతున్నారు. ఇందులో ఎమెర్జెన్సీ అలర్ట్ కూడా ఉంటుంది. బాడీలో ఆక్సీజన్ రేషియా తగ్గినా, టెంపరేచర్ పెరిగినా, పల్స్ డౌన్ అయినా వెంటనే అలర్ట్ చేస్తుంది. స్టార్టప్ గా ప్రారంభించిన దీనికి మార్కెట్ నుంచి 22 కోట్లు సపోర్ట్ వచ్చింది. వెంచర్ కేపటిలిస్టులకు స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. వచ్చే నెలలో తమ పూర్వ విద్యార్ధుల ద్వారా మొత్తం 70 దేశాల్లో రిస్ట్ బాండ్ ను విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి దేశీయంగా వస్తున్న రిస్ట్ బాండ్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!