మారుతి దర్శకత్వంలో చెర్రీ
- February 05, 2016
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్ తరువాత చేయబోయే సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ, సుకుమార్ లాంటి దర్శకులను లైన్ లో పెట్టిన చెర్రీ, ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో దర్శకుణ్ని చేర్చాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే చిన్న దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్న మగధీరుడు ఇటీవల ఓ భారీ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఒకప్పుడు డబుల్ మీనింగ్ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరున్న మారుతి, భలే భలే మగాడివోయ్ సక్సెస్ తో ఆ పేరు చెరిపేసుకున్నాడు. ముఖ్యంగా క్లీన్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ భారీ వసూళ్లను సాధించి మారుతిని స్టార్ డైరెక్టర్ ను చేసింది.దీంతో వెంకటేష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు మారుతి.ప్రస్తుతం వెంకీ హీరోగా బాబు బంగారం సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి, ఆ సినిమా తరువాత రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా, మారుతికి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







