హైదరాబాద్:GHMC మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా..
- July 26, 2020
హైదరాబాద్:GHMC మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకింది. ఎలాంటి లక్షణాలు లేవు. అయినా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. గతంలోనూ మేయర్ రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. తాజాగా ఆయన కారు డ్రైవర్ కు పాజిటివ్ రాగా మేయర్ కూడా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ అనంతరం ప్లాస్మా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నగరంలో వర్షాలు కురుస్తున్నందున దోమల ప్రమాదాన్ని నివారించే కార్యకలాపాలను ముమ్మరం చేయాలని వ్యాధుల వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







