యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది: సురేష్ రైనా
- July 26, 2020
యూఏఈ వేదికగా సెప్టెంబర్ లో జరగనున్న ఐపీఎల్ 2020 కోసం నెలరోజుల ముందే అక్కడికి వెళ్తాము అని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) బాట్స్మెన్ సురేష్ రైనా తెలిపాడు. ఈ ఏడాది మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఐసీసీ 2020 టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఆ విండోలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరగనుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇక యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ పై సురేష్ రైనా మాట్లాడుతూ... నేను 2014 లో అక్కడ ఆడిన అనుభవంతో చెప్తున్నా..యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడి లాగా ప్రతి మ్యాచ్ కు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందదు. కేవలం మూడు స్టేడియాల్లోనే అన్ని మ్యాచ్ లు జరుగుతాయి. కాబట్టి ఒక్క స్టేడియం నుండి మరొకదానికి బస్సు లోనే వెళ్లడం. అందువల్ల ఆటగాళ్లు అలసిపోరు. ఇక మేము నెల ముందు అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడికి పరిస్థితులను, వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని తెలిపాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







