ఫ్లిప్ కార్ట్:బుక్ చేసిన గంటన్నరలో డెలివరీ
- July 29, 2020
బెంగుళూరు:ఫ్లిప్ కార్ట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వస్తువులను 90 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు ఫ్లిప్ కార్ట్ షాకిచ్చింది. ఇక నుంచి గ్రాసరీస్,హోమ్ యాక్ససిరీస్ లను కొనుగోలు చేస్తే కేవలం గంటన్నరలో అందిస్తామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ హైపర్ లోకల్ సర్వీసులు ఆఫర్ చేయనుంది. రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లను కూడా వేగంగా డెలివరీ చేస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు బెంగుళూరులోని కొన్ని ప్రాంతాలల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. గూగుల్‌కు చెందిన డుంజో, స్విగ్గీ కూడా భారత్‌లో గ్రాసరీస్‌ను డెలివరీ చేస్తున్నాయి.
కరోనా వైరస్ ప్రభావంతో గ్రాసరీస్ ఆన్లైన్ డెలివరీకి ఫుల్ డిమాండ్ నెలకొంది. డిమాండ్ కు తగ్గట్టుగా కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. జియో మార్ట్ కు కూడా ఫ్లిప్ కార్టు ఝలకిచ్చిందని చెప్పవచ్చు. ఫ్లిప్ కార్టు ఒక అడుగు ముందుకు వేసి మొబైల్ ఫోన్లను కూడా వేగంగా అందిస్తామని ప్రకటించడంతో ఇతర కంపెనీలకు గట్టి షాకిచ్చినట్టైంది. ప్రస్తుతం గ్రాసరీస్ డెలివరీ చేస్తున్న కంపెనీలు కొన్ని గంటల సమయం తీసుకుంటున్నాయి. వాటికి షాకిచ్చేలా ఫ్లిప్ కార్ట్ కేవలం గంటన్నరలో వస్తువులు డెలివరీ చేస్తామని ప్రకటించింది.
Delivery within the booked hour and a half
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







