ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు..
- July 30, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30,557కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా-9, గుంటూరు జిల్లా-9, అనంతపురం-8, కర్నూలు-8, విశాఖపట్నం-8, చిత్తూరు-6, కడప-6, ప్రకాశం- 4, విజయనగరం-4, కృష్ణా-3, నెల్లూరు-1, శ్రీకాకుళం-1 పశ్చిమ గోదావరి-1 కరోనాతో మరణించారు.
ఏపీలోని మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1441, కర్నూలులో 1252, విశాఖపట్నంలో 1223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరిలో 998, అనంతపురంలో 954, గుంటూరులో 946, కడపలో 753, నెల్లూరులో 702, శ్రీకాకుళంలో 586, చిత్తూరులో 509, ప్రకాశంలో 318, కృష్ణాలో 271, విజయనగరంలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







