హర్మేనియన్ ట్రెయిన్ సర్వీసుల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్
- July 30, 2020
జెడ్డా: హర్మేనియన్ హై స్పీడ్ ట్రెయిన్ సర్వీసు పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మక్కా మరియు మదీనా మధ్య జెడ్డా మీదుగా అలాగే కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ ఆఫ్ రబిగ్ మీదుగా వెళ్ళే ఈ రైలు సర్వీసు సెప్టెంబర్ నుంచి మళ్ళీ అందుబాటులోకి రానుంది. ఈ ట్రెయిన్‌కి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అల్ హర్మేనియన్ రైల్వే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియలో రిజర్వేషన్లు చేసుకోవచ్చు. గత డిసెంబర్లో ఈ రైలు సర్వీసుని నిలిపివేశారు. జెడ్డాలోని సులేమానియా స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో దీన్ని ఆపేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ నేపథ్యంలో సర్వీసుల్ని ఆపేయాల్సి వచ్చింది. సర్వీసు రద్దు సమయంలో ప్రత్యేక మెయిన్టెనెన్స్ చర్యలు చేపట్టారు. మక్కా - మదీనా మధ్య రోజూ 12 ట్రిప్‌లు నడిచేవి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







