భారత్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
- August 01, 2020
భారత దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,000కు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 57,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 50,000కి పైగా కరోనా కేసులు నమోదవడం వరుసగా ఇది నాలుగవ రోజు. శుక్రవారం కరోనా కారణంగా 766 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక కరోనా కేసులు జూన్ నెలతో పోలిస్తే జూలైలో 2.8 శాతం అత్యధికంగా నమోదయ్యాయి. జూన్ నెలలో సుమారు 4 లక్షల కేసులు ఉన్నాయి. కాగా జూలైలో కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య జూన్ కంటే 1.6 రెట్లు అధికంగా ఉంది. జూలై నెలలో 11.1 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19,122 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 16,96,780 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 36,551 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







