రెండు విమానాలు ఢీ..7 మంది మృతి..
- August 01, 2020
అమెరికా:అమెరికాలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సోల్డోట్నా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 8:27కి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓ విమానంలో పైలట్ ఒక్కరే ఉండగా.. మరో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్టు భద్రతాధికారులు వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో అలస్కా చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా మండలి విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు