యూఏఈకి తిరుగు ప్రయాణంలో షరతులు..పాస్ పోర్టులో వీసా స్టాంప్ తప్పనిసరి
- August 01, 2020
యూఏఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ తిరుగు ప్రయాణం అయ్యే ప్రవాసీయుల విషయంలో ఆ దేశ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. నివాస అనుమతులు ఉన్నవారు తప్పనిసరిగా తమ రెసిడెన్సీ పర్మిట్ కు సంబంధించి పాస్ పోర్టులో స్టాంప్ చేసుకోవాలని షరతు విధించారు. అలాగే ICA, GDRFA ఆమోదం ఉండాలి. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులను పునరుద్ధరించిన నేపథ్యంలో పలువురు ప్రవాస భారతీయులు డాక్యుమెంటేషన్ కు సంబంధించి ఎక్కువ సందేహాలు అడుగుతున్న నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను స్పష్టం చేసింది. పాస్ పోర్టులో రెసిడెన్సీ పర్మిట్ స్టాంప్ వేయించుకోవటంతో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదం ఉన్న ల్యాబోరేటరి నుంచి తీసుకున్న కోవిడ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే యూఏఈ చేరుకోగానే క్వారంటైన్ సమ్మతిస్తూ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!