అనుమతి లేకుండా హజ్ యాత్ర..ఏడుగురి అరెస్ట్..ఇద్దరిపై బహిష్కరణ వేటు
- August 02, 2020
రియాద్:హజ్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భక్తులను తరలిస్తున్న ఏడుగురికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ ఏడాది హజ్ యాత్రపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురు వ్యక్తులు భక్తులను అక్రమంగా తరలిస్తూ భద్రత బలగాల సోదాల్లో పట్టుబడ్డారు. మొత్తం 17 మంది భక్తులను అనుమతి లేకుండా పవిత్ర ప్రార్ధనా మందిర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారికి 105 రోజుల జైలు శిక్షతో పాటు SR170,000ల భారీ జరిమానా విధించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ప్రవాసీయులు కూడా ఉండటంతో వారిపై దేశబహిష్కణ వేటు పడింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..