తెలంగాణ లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు
- August 04, 2020హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1286 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1066 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 49,675గా ఉంది. గత 24 గంటల్లో 12 మంది కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 563కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
GHMC పరిధిలో 391, రంగారెడ్డిలో 121 కరీంనగర్లో 101, మేడ్చల్‌లో 72 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా రికవరీ రేటులో జాతీయ స్థాయి(65శాతం)తో పోలిస్తే తెలంగాణలో 72శాతంతో మెరుగ్గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ