తెలంగాణ లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు
- August 04, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1286 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1066 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 49,675గా ఉంది. గత 24 గంటల్లో 12 మంది కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 563కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
GHMC పరిధిలో 391, రంగారెడ్డిలో 121 కరీంనగర్‌లో 101, మేడ్చల్‌లో 72 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా రికవరీ రేటులో జాతీయ స్థాయి(65శాతం)తో పోలిస్తే తెలంగాణలో 72శాతంతో మెరుగ్గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







