కువైట్ నుంచి వెళ్లిపోయిన 2 లక్షల మంది ప్రవాసీయులు
- August 05, 2020
కువైట్ సిటీ:కువైటేజేషన్ నేపథ్యంలో కువైట్ నుంచి ప్రవాసీయులు భారీగా వారీ సొంత దేశాలకు తరలివేళ్తున్నారు. మార్చి 16 నుంచి జులై 31 వరకు దాదాపు 2,03,967 మంది కువైట్ విడిచి వెళ్లినట్లు డీజీసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఆరోగ్యభద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆగస్ట్ 1 నుంచి కువైట్ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించారు. దీంతో ఆగస్ట్ 1 నుంచి రెండు రోజుల వ్యవధిలో 4,271 మంది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించారు. విమాన సర్వీసులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని డీజీసీఏ ఆపరేషన్ డైరెక్టర్ తెలిపారు. అయితే..కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే మంత్రిమండలి నిర్ణయం విమాన సర్వీసులను పునరుద్ధరణ తొలిదశలో భాగంగా పస్తుత విమాన సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..