దుబాయ్ పోలీసుల దాతృత్వం..సొంత ఖర్చులతో స్వదేశాలకు 1,145 ఖైదీల తరలింపు
- August 05, 2020
దుబాయ్:వివిధ నేరాల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న ఖైదీల పట్ల దుబాయ్ పోలీసులు దాతృత్వం ప్రదర్శించారు. తొలి అర్ధ వార్షికంలో దాదాపు 1,145 మందిని వారి సొంత దేశాలకు తరలించేందుకు విమాన టికెట్ల ఖర్చులను పోలీసులు భరించారు. పలువురు దాతల సహకారంతో Dhs1,479,010 సేకరించి ఖైదీలకు పైసా ఖర్చు లేకుండా విమాన టికెట్లను ఏర్పాటు చేశారు. దుబాయ్ పోలీసుల చొరవతో సొంత దేశాలకు వెళ్లిన 1,145 మందిలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. ప్రతి మనిషి పరివర్తన చెందిన చెందేందుకు మరో అవకాశం కల్పించాలని అందులోభాగంగానే శిక్షాకాలం పూర్తి చేసుకున్నవారికి తమ వంతుగా తోచిన సాయం అందిస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం దాతలు కూడా సహకరిస్తున్నారని వెల్లడించారు. అంతేకాదు..తమకు పలువురి నుంచి అందుతున్న ఆర్ధిక సహాకరంతో అవసరమైన వారికి అహార సామాగ్రి సమకూర్చటం, రెసిడెన్షియల్ ఛార్జీలు భరించటం, వైద్య పరికరాలు, బ్లడ్ మనీ నిర్వహణతో పాటు విద్యార్ధులకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్యూషన్ ఫీజులు చెల్లించటం, స్కూలు బ్యాగుల పంపిణీ, ఈద్ సందర్భంగా బట్టల పంపిణీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మానవీయ కోణంలోనే ప్రతి ఏడాది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







