కోవిడ్ ఎఫెక్ట్ : దుబాయ్ విద్యార్ధులకు ఈ ఏడాది దూరవిద్యా విధానం
- August 05, 2020
కరోనా ఎఫెక్ట్ ఈ విద్యా సంవత్సరంపై పెను ప్రభావం చూపిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించేందుకు సంకోచిస్తున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో దూరవిద్య ద్వారా పాఠాలు నేర్చుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఆగస్ట్ 30 నుంచి స్కూళ్లు ప్రారంభించాలనుకున్న నేపథ్యంలో తొలుత విద్యార్ధులకు ఇన్ క్లాస్ విద్యా విధానాన్నే అమలు చేయాలని యోచించింది. అయితే..పిల్లలను స్కూళ్లకు పంపించే విషయమై తల్లిదండ్రుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మానవ అభివృద్ధి, విజ్ఞాన అధికార విభాగం అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్స్ కి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖాముఖి విద్యా విధానమే తమ విధానమైనప్పటికీ..విద్యార్ధుల తల్లిదండ్రులు కోరితే వందశాతం డిస్టెన్స్ లెర్నింగ్ సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులో పేర్కొంది. భవిష్యత్తులో విద్యార్ధులు ముఖాముఖి విద్యకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..