ఏ.పీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
- August 05, 2020
అమరావతి:ఏ.పీలో గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాలను తాజాగా ఆరోగ్య శాఖ వెల్లడించింది.నేడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. తాజాగా 60,576 శాంపిల్స్ పరీక్షించగా 10,128 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,86,461 కి చేరుకుంది.
ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 8,729 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తాజాగా కరోనా బారినపడి 77 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య నేటి వరకు 1681 కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,35,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1544 కొత్త కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో అత్యధికంగా నేటి వరకు 221 మంది మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







