తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు
- August 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2092 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1289 మంది పూర్తిగా కోలుకోగా .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 52,103గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కేసుల వివరాలు GHMCలో 535, రంగారెడ్డి జిల్లాలో 169, వరంగల్ అర్బన్ జిల్లాలో 128, మేడ్చల్ జిల్లాలో 126, కరీంనగర్ జిల్లాలో 123, సంగారెడ్డి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







