ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో ప్రభాస్
- August 06, 2020
హైదరాబాద్:ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు సైతం ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. కరోనా టైమ్ కాబట్టి మాస్కు ధరించే బయటకు వచ్చారు. దీంతో మాస్కులో ఉన్న ప్రభాస్‌తో ఫొటోలు దిగేందుకు అక్కడి జనం ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని నొప్పించడం ఇష్టం లేని డార్లింగ్ ఫొటోలకు పోజిచ్చారు. ఇదిలా వుండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. తన 21వ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జోడీగా నటించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?