ఏపీలో కొత్తగా 10,328 కరోనా కేసులు
- August 06, 2020
అమరావతి:ఏ.పీలో కోవిడ్ 19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,328 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గురువారం వెల్లడించింది.72మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,753కి చేరింది.
కరోనా వల్ల గురువారం అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 6, నెల్లూరు 6, ప్రకాశం 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 3, కర్నూలు 2, శ్రీకాకుళంలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1351 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలులో 1285, అనంతపురంలో 1112 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 8516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 112870 కాగా, ప్రస్తుతం 82166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







