మస్కట్ ఫెస్టివల్‌లో పసిపిల్లలతో జాగ్రత్త
- February 06, 2016
మస్కట్ ఫెస్టివల్‌కి విచ్చేసే విజిటర్స్ తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఫెస్టివల్‌ని సందర్శించే క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అశ్రద్ధ చేస్తున్నారనీ, తద్వారా పిల్లలు తప్పి పోతున్నారనీ, ఫెస్టివల్ నిర్వాహకులు అలాంటి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, పది మంది పిల్లల కంటే ఎక్కువమంది తప్పిపోయిన సందర్భాల్లో వారిని ఎక్కువసేపు మేనేజ్ చేయడం కష్టమవుతోందని పోలీసు అధికారులు చెప్పారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించి వెంటనే తల్లిదండ్రులు, ఫెస్టివల్ నిర్వాహకుల్ని సంప్రదిస్తే పట్టుకోవడం తేలికవుతుందని వివరించారు. పిల్లలకు తగిన ఆహారం ఇచ్చినా, ధైర్యం చెప్పినా తల్లిదండ్రుల కోసం ఏడుస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. వీకెండ్స్‌లో ఒక్కోసారి 60 మంది పిల్లల వరకు తప్పిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మస్కట్ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









