హోం క్వారంటైన్‌ ఉల్లంఘిస్తే జరీమానా, జైలు

- August 12, 2020 , by Maagulf
హోం క్వారంటైన్‌ ఉల్లంఘిస్తే జరీమానా, జైలు

కువైట్ సిటీ:వలసదారులెవరైనా కువైట్‌ వచ్చిన తర్వాత హోం క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష, అలాగే 5000 కువైటీ దినార్స్‌ జరీమానా ఎదుర్కోవాల్సి వుంటుంది. కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ నియంత్రణ - హెల్త్‌ ప్రికాషన్స్‌ లా నెంబర్‌ 8 - 1969 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి, తమ స్వీయ ఆరోగ్యం, అలాగే సమాజ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com