యూఏఈ:పాస్ పోర్ట్ కాపీతో వీసా స్టేటస్, వాలిడిటి తెలుసుకునేలా ఆన్ లైన్ విధానం

- August 12, 2020 , by Maagulf
యూఏఈ:పాస్ పోర్ట్ కాపీతో వీసా స్టేటస్, వాలిడిటి తెలుసుకునేలా ఆన్ లైన్ విధానం

ప్రవాసీయులకు వీసా స్టేటస్, గడువు ముగిసే తేది ఎప్పటికీ ఓ అగ్నిపరీక్షే. చాలా వరకు యూఏఈ విసాలు రెండు, మూడేళ్ల కాలపరిమితితో ఉంటాయి. అయితే..వీసా తీసుకున్న సమయంలో గడువు ముగిసే తేది పట్ల కొంత అప్రమత్తంగా ఉన్నా...కాలక్రమంలో నిర్లక్షం వల్ల కావొచ్చు, పని ఒత్తిడి ఇతర ఆలోచనలతో గడువు తేది మర్చిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా లాస్ట్ డేట్ కు సంబంధించి ఆ నెల గుర్తున్నా..తేది విషయంలో కొద్ది గందరగోళం కూడా ఉంటుంది. వెంటనే చెక్ చేసుకునేందుకు పాస్ పోర్టును ఎప్పుడూ వెంట పెట్టుకునే అలవాటు కూడా ఉండదు. కొద్దిమంది ప్రవాసీయుల పాస్ పోర్టులు స్పాన్సర్లు, వారు పని చేసే యజమానుల దగ్గరే ఉంటాయి కూడా. తీరా గడువు తేది ముగిసిన తర్వాత జరిమానాలు..ఇతర చికాకులు తప్పవు. అయితే..ఈ సమస్యలు లేకుండా యూఏఈ అధికారులు ప్రవాసీయులకు కొన్ని కీలక సూచనలు చేశారు. పాస్ పోర్ట్ వెంట లేకున్నా..ముందుగానే పాస్ పోర్ట్ కాపీని ఫోన్ లో సేవ్ చేసుకోవటం ద్వారా కొద్దిమేర వీసా స్టేటస్, వాలిడిటీ పట్ల అప్రమత్తంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. అంతేకాదు..ఫోన్ లో స్మార్ట్ కాపీ సేవ్ చేసుకొని వారు, చేసుకునే అవకాశం లేని వారికి ఆన్ లైన్ లో వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి వీసా గడువుపై సందేహాలు ఉంటే యూఏఈ అధికార వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి పాస్ పోర్ట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

పాస్ పోర్ట్ ద్వారా వీసా వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం సూచించిన విధానం :
స్టెప్ 1 : https://smartservices.ica.gov.ae/echannels/web/client/default.html#/fileValidity

లింకు అడ్రస్ తో ప్రభుత్వ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 2 : 'పాస్ పోర్ట్ ఇన్ఫర్మేషన్' రేడియో బటన్ ను ఎంపిక చేసుకోవాలి.
స్టెప్ 3 : రెసిడెన్సీ(లేదా) వీసా అప్షన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 4 : పాస్ పోర్ట్ నెంబర్ తో పాటు పాస్ పోర్ట్ ఎక్స్ పైర్ డేట్ ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 5 : కుడివైపు సూచించిన దానిలో మీరు ఏ దేశం నుంచి వచ్చారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎడమవైపున మీకు ఓ నంబర్ వస్తుంది.
స్టెప్ 6 : స్క్రీన్ పై కనిపించే క్యాప్చాను బాక్స్ లో టైప్ చేయాలి. ఆ తర్వాత మీ పాస్ట్ పోర్ట్ పేజీ డిస్ ప్లే అవుతుంది. అందులో మీ వీసా స్టేటస్, వాలిడిటీ అన్ని చెక్ చేసుకోచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com