కువైట్: కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉంటేనే కొత్త వీసాల జారీ
- August 14, 2020
వివిధ దేశాల నుంచి కువైట్ రావాలనుకుంటున్న వారికి కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల కొత్త వీసాల జారీని నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే..కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉన్న వారికి మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇక నుంచి కువైట్ రావాలనుకునే వాళ్లంతా తప్పనిసరిగా కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటిని ముందుకు సంప్రదించాల్సి ఉంటుంది. కమిటీ దరఖాస్తుదారులకు అనుమతి ఇచ్చిన తర్వాతే కొత్త వీసా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే లాక్ డౌన్ నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా కువైట్ వచ్చే మంగళవారం నుంచి నాలుగో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే..పాక్షిక కర్ఫ్యూ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష