దుబాయ్ తిరిగి వచ్చే ప్రవాసీయులకు ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ ఆమోదం తప్పనిసరి
- August 14, 2020
దుబాయ్ తిరిగి వచ్చే యూఏఈ ప్రవాసీయులు తప్పనిసరిగా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని భారత్-యూఏఈకి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలు కోరాయి. అయితే..గతంలో ఐసీఏ, జాతీయ అత్యవసర విపత్తుల నిర్వహణ అధికార విభాగం యూఏఈ తిరుగు ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా ఈ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేసింది. ముందస్తు అనుమతులు అవసరం లేదన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక నుంచి దుబాయ్ వెళ్లే ప్రవాసీయులు అంతా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాగే దుబాయ్ వెళ్లే వాళ్లంతా దుబాయ్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, అబుధాబి, షార్జా వెళ్లే వాళ్లంతా అల్ హోస్న్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. మరోవైపు భారత్-యూఏఈ మధ్య సర్వీసులు నడుపుతున్న ఫ్లై దుబాయ్ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేయటం గమనార్హం. అటు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రయాణికులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలాఉంటే..దుబాయ్ వెళ్లే ప్రవాసీయుల ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశానికి సంబంధించి ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







