కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలి : అక్కినేని నాగార్జున

- August 14, 2020 , by Maagulf
కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలి : అక్కినేని నాగార్జున

కరోనాను జయించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ప్లాస్మా దానంపై చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలపాలని కోరారు. 

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్లాస్మా దానం చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ముందుకు రావడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా సీపీ సజ్జనార్‌ చొరవ, కృషి అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేవారు దేవుళ్లతో సమానమని కొనియాడారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం చేయడం వల్ల 600 మంది ప్రాణాలు నిలపగలిగామని పేర్కొన్నారు. 

ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 90002 57058, 94906 17440 లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com