పవన్ కళ్యాణ్ తో వేదలం రీమేక్..
- February 06, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా, పవన్ ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడని అర్థమై పోయింది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్నాయి. అందుకే తమిళ్ లో ఈ సినిమాను నిర్మించిన ఎ ఎమ్ రత్నం తెలుగులోనూ పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ తో రభస సినిమాను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడంటూ వచ్చిన వార్తలను రత్నం ఖడించాడు.పవన్ కళ్యాణ్ తో వేదలం రీమేక్ చేస్తున్న మాట నిజమే కాని, ఆ సినిమాకు సాంకేతిక నిపుణులను, నటీనటులను ఇంత వరకు ఫైనల్ చేయలేదని తేల్చేశాడు. దీంతో ఈ సినిమా ఎవరి డైరెక్షన్ లో ఎప్పుడు స్టార్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









