నూతన స్థాయికి చేరుకోనున్న యు.ఎ. ఇ. - భారత్ సంబంధాలు
- February 07, 2016
సుందరమైన భాగాస్వమ్యాలన్నీ సరైనా సమయం మరియు వేగంతో ముడిపడతాయి. అందుకే , కేవలం 6 నెలల వ్యవధిలో అబుదాబీ సాయుధ దళాల డిప్యూటీ సుప్రేం కమాండర్ , యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారతదేశాన్ని సందర్శించడం ఇందుకు ఒక మంచి ఉదాహరణ. గత ఏడాదీ ఆగష్టులో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ యు.ఎ. ఇ. పర్యటనకు రావడం ఒక మంచి శుభ పరిణామం. ఈ రాక ద్వారా రెండు దేశాల మధ్య మంచి మైత్రీ బలపడటమే కాక ఆర్ధిక లావాదీవీలకు సంబంధించి పలు వ్యూహాత్మక విషయాలను గూర్చి లోతుగా పరిశీలించారు. యు.ఎ. ఇ. లో భారతదేశ దౌత్యాధికారి సీతారాం ఖలీజ్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ , యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారతదేశ పర్యటన లో రాజకీయ, ఆచరణాత్మక పెట్టుబదులు రెండు దేశాల భాగస్వామ్యంలో ఉంటాయని తెలిపారు. గత ఏడాదే మోడీ పర్యటనలో రాజకీయ నిశ్యథార్ధయ స్థాయికి చేరుకొంది. సంబంధం నూతన్ స్థాయికి చేరుకోవదానికీ కొత్త సంబంధాల అవసరం ఎంతైనా ఉంది. రెండు దేశాల మధ్య ఒక వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు గూర్చి తీవ్రంగా చర్చించడం ఈ తక్కువ కాలంలో ఒక కొస మెరుపుగా ఉంది. బాస్మతీ బియ్యం, ఖర్జూర పండ్లు, బంగారం కొనుగోలు గూర్చి కాక , ఆర్ధిక వ్యవస్థ కు ఎంతో కీలకమైన ఇంధన వ్యవహారాలపై రెండు దేశాల భాగస్వామ్యం కావడం ఒక గొప్ప పరిణామం. ఈ నేపధ్యంలో ఆగష్టు 2015 గల్ఫ్ ప్రాంతంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కోవడం మార్కెట్ విభేదాల కారణంగా ఆర్ధిక స్థితి అద్వాన్నంగా మారింది. ఇటువంటి అస్థిర వాతావరణంలో యు.ఎ. ఇ. చమురు రంగం ద్వారా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచి విస్తరించాలని యోచించింది. ఈ సందర్భంలో భారతదేశం సంపూర్ణ ఆరోగ్యస్థితి, ఆర్ధిక పరిస్థితి ఆకర్షణీయంగా ఉండటంతో యు.ఎ. ఇ. దృష్టి భారత్ వైపు మళ్ళింది. నైపుణ్యంతో కూడిన పెట్టుబడులను ఆ దేశాలలో వినియోగించడం ద్వారా అభివృద్ధిని గణనీయంగా సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునరుత్పత్తి శక్తీ గోళంగా, సుందర నగరాల రూపకల్పనకుయు.ఎ. ఇ. కేంద్ర బిందువుగా ఉంది. భారతదేశం కు ప్రస్తుతం ఆయా రంగాలాలలో సాంకేతికత ఎంతో అవసరం ఉంది. యు.ఎ. ఇ. - భారత్ సంబంధాలు పటిష్టపరచడానికి ఏడాది సెప్టెంబర్ లో యు.ఎ. ఇ. విదేశాంగ మంత్రి భారత్ పర్యటించారు. ఆ తర్వాత అక్టోబర్ లో భారత్ వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ యు.ఎ. ఇ. విచ్చేశారు. అలాగే , నవంబర్ లో భారత్ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ యు.ఎ. ఇ. పర్యటించారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం 65 శాతం పెరిగేందుకు పలు కీలక చర్యలు తీసుకొన్నారు. అలాగే, 75 మిలియన్ల పెట్టుబడితో ఇరు దేశాల మధ్య ఒక ఉమ్మడి కార్యక్రమం మొదలుకానుంది. గత ఏడాది యు.ఎ. ఇ. అధికారుల బృందం భారత అంతరిక్ష పరిశొధన కేంద్రాన్ని సందర్శించారు. 2021 లో యు.ఎ. ఇ. ' మార్స్ మిషన్ ప్రణాళికకు భారతదేశం తన సంపూర్ణ సహకారం అందివ్వనుంది, అంతేకాక యు.ఎ. ఇ. కు అవసరమైన వ్యాపార ఉపగ్రహ ప్రయోగాలకు భారత్ తన మద్దతును అందివ్వనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









