ఏపీలో కొత్తగా 8,012 కేసులు
- August 16, 2020
అమరావతి: ఏపీలో కొత్తగా మరో 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. మరణాల సంఖ్య 2,650 మందికి పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 48,746 నమూనాలను పరిశీలించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,117 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు పేర్కొంది.
కరోనా కారణంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, నెల్లూరు తొమ్మిది; అనంతపురం, పశ్చిమ గోదావరి ఎనిమిది మంది; విశాఖపట్నం ఏడుగురు; గుంటూరు, కడప ఆరుగురు; ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం నలుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28.60 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







