'ఐ యామ్ యాన్ ఇండియన్' పాట ను విడుదల చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్
- August 16, 2020
హైదరాబాద్:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఐ యామ్ యాన్ ఇండియన్' పాటను విడుదల చేసారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సీ. సజ్జనార్, నిర్మాత చిల్లర కళ్యాణ్, నటుడు ఆలీ. గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో S 5 సినిమాలోని ఈ పాటను ఆవిష్కరించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం, దేశ భద్రత మరియు అభివృద్ధి కోసం అందరం కృషి చేయాలని కోరారు. సమాజం మనకు ఏమీ చేసింది అనేది కాకుండా మనం సమాజం కోసం, దేశం కోసం ఏమీ చేశామన్నదే ముఖ్యమనే అబ్రహం లింకన్ మాటలను గుర్తు చేసుకున్నారు.
S 5 సినిమా లో 'ఐ యామ్ యాన్ ఇండియన్' పాట పాడిన సింగర్ శ్రీరామ చంద్ర, S 5 సినిమా డైరెక్టర్ సన్నీ లతో పాటు సినిమా కు పనిచేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. రాబోయే గణేష్ ఉత్సవాలలో ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీడ్ గణేష్ ను నెలకొల్పి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో ప్లాస్మా డోనేషన్ చాల ముఖ్యమైనదని, కాబట్టి ప్రతి సినీ హిరో అభిమానులు ప్లాస్మా డోనేషన్ కు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?