తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపు
- February 07, 2016
తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయంహైదరాబాద్తెలంగాణ కేబినెట్ భేటీ ఆదివారం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు, గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై చర్చ జరుగ నున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకుగానూ తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజ్ కోసం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.దుమ్ముగూడెం రీ డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య శాఖలతో పాటు వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియమకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరొక స్లాబ్‌ను ఏర్పరిచే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







