శంషాబాద్: అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- August 18, 2020
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభించడంతో విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్, యూకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వారానికి నాలుగు విమాన సర్వీసులు నడవనున్నట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి బ్రిటీష్ ఎయిర్వేస్ బీఏ 276 బోయింగ్ 787 డీమ్లైనర్ విమానం బయలుదేరి వెళ్లిందని చెప్పారు. ప్రతి సోమ, బుధ, శుక్ర,
ఆదివారాల్లో ఈ విమాన సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!