యూఏఈ నుంచి విమాన ప్రయాణానికి కోవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి
- August 18, 2020
యూఏఈ:యూఏఈ వచ్చేందుకే కాదు..యూఏఈ నుంచి విమాన ప్రయాణం చేయాలన్నా ఇక నుంచి కోవిడ్ 19 పీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మేరకు యూఏఈలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలకు నోటీసులు అందాయి. ఇక నుంచి షార్జా, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు చెక్ ఇన్ కౌంటర్ దగ్గర కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ ను విధిగా చూపించాల్సి ఉంటుంది. విమానం బయల్దేరే సమయానికి 48 గంటల లోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే అనుమతిస్తారు. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ మేరకు సమాచారం అందించింది. అలాగే అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కూడా రెండు విమానయాన సంస్థలకు కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని తెలుపుతూ సమాచారం అందించింది. దీంతో యూఏఈ పౌర విమానయాన సంస్థ ఎతిహాద్ గత బుధవారమే తమ ప్రయాణికులకు ఆర్టీ పీపీఆర్ టెస్ట్ ఫలితాలకు సంబంధించి సమాచారం అందించింది. తమ సర్వీసుల్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణ సమయానికి 96 గంటల్లో తీసుకున్న కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కాపీ ఖచ్చితంగా చూపించాలని ప్రయాణికులను కోరింది.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!