తొలిసారి వేరే హీరోకి ఆయన గాత్రం : కమల్
- February 07, 2016
నటన, రచన, దర్శకత్వం, గానం, నిర్మాణం.. ఇలా సినిమా పరిశ్రమలోని 24 శాఖలపై మంచి పట్టు సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్. గాయకునిగా ఇప్పటివరకూ కమల్ తాను నటించిన చిత్రాలకు చాలా పాటలు పాడారు. తొలిసారి వేరే హీరోకి ఆయన తన గాత్రం అందించారు. రాజ్‌దురై దర్శకత్వంలో తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ ('కడలి' ఫేమ్) హీరోగా 'ముత్తురామలింగం' అనే చిత్రం రూపొందుతోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో హీరో పరిచ య గీతానికి ఓ గంభీరమైన గొంతు కావాలనుకున్నారు ఇళయరాజా. వెంటనే కమల్‌ను సంప్రతించారు. ఇప్పటికే ఇళయరాజా సంగీతంలో పలు చిత్రాలకు పాటలు పాడిన కమల్ ఆయన మీద గౌరవంతో వెంటనే ఒప్పుకున్నారు.కమల్ పాడగా ఈ పాటను ఇటీవల రికార్డ్ చేశారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







