ఇకపై ట్యాక్సీల్లో ముగ్గురు ప్రయాణీకులకు అవకాశం

- August 19, 2020 , by Maagulf
ఇకపై ట్యాక్సీల్లో ముగ్గురు ప్రయాణీకులకు అవకాశం

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ట్రాఫిక్‌ సెక్టార్స్‌కి కీలకమైన ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇవ్వడం జరిగింది. ట్యాక్సీల్లో ఇకపై ముగ్గురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం టాక్సీల్లో ఒకే ఒక్క ప్రయాణీకుడికి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పలు ట్యాక్సీ కంపెనీలు, ప్యాసింజర్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆ ఫలితంగా మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ట్రిప్‌లో ముగ్గురు ప్రయాణీకుల్ని ట్యాక్సీల్లో ఎక్కించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com