ఏపీ:వినాయక చవితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- August 19, 2020
అమరావతి:మరో మూడు రోజుల్లోనే గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి కోసం ఇప్పటికే చాలా మంది విగ్రహాలను బుక్ చేశారు. మండపాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గణేష్ చతుర్ధి వేడుకలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవుకు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం దేవాదాయశాఖ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ భేటీలో దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు, దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, హెల్త్ డైరెక్టర్ అరుణ కుమారి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రాజశేఖర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భేటీ అనంతరం మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. కరోనా పరిస్థితుల దృష్ట్యాల బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలు చేసుకోవచ్చని చెప్పారు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..