గ్రాడ్యుయేట్స్‌లో 47 శాతానికే ఉద్యోగాలు
- February 07, 2016
గ్రాడ్యుయేషన్ పొదిన ఒమనీయుల్లో కేవలం 47 శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయనీ, మిగతా 53 శాతం మందికి ఉద్యోగాలు దక్కడంలేదని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సైన్స్, ఫిలాసఫీ, ఇంజనీరింగ్ చేసినవారికి ఉద్యోగులు త్వరగానే దొరుకుతున్నా, ఆర్ట్స్ చదివినవారికి ఉద్యోగాలు దొరకడంలేదు. ఇది ఆందోళనకర విషయమని సోషల్ రీసెర్చర్ యూనిస్ అలీ చెప్పారు. ఉద్యోగం కోసం జనవరిలో అప్లయ్ చేసుకోగా, ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ జరిగిందనీ అక్టోబర్‌లో రిజెక్షన్‌కి గురయినట్లు తెలిసిందని మహమ్మద్ అల్ లవాతీ అనే ఉద్యోగార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగానికి 15 మందికి పైగా పోటీ పడుతుండడం, నిరుద్యోగ సమస్యను తెలియజేస్తోందని ఉద్యోగార్థులు చెప్పారు. చమురు ధరల పతనంతో వివిధ కంపెనీలు కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో చొరవ చూపడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







