ఏ.పిలో 91 కరోనా మరణాలు
- August 21, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,940కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.మరోవైపు రాష్ట్రంలో గత 24 గంటల్లో మృతుల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో కొత్తగా 91 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య 3,092కి పెరిగింది.
చిత్తూరు జిల్లాలో 16 మంది చనిపోగా, పశ్చిమ గోదావరిలో 13, నెల్లూరులో 12, తూర్పు గోదావరిలో 11, అనంతపురంలో 8, విశాఖపట్నంలో 6, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 4, గుంటూరులో 3, కృష్ణాలో 3, కర్నూలులో 3 మంది చొప్పున మృతిచెందారు. ఇదిలావుండగా రాష్ట్రంలో శుక్రవారం 8,827 మంది డిశ్చార్జ్ అవగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,44,045కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,803 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఏ.పిలో ఇప్పటివరకు 31 లక్షల 29 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







