యూఏఈలోని భారత వ్యాపారికి సత్కారం..అతని సేవలను ప్రశంసించిన యూఏఈ ప్రభుత్వం
- August 21, 2020
యూఏఈ:భారత్ కు చెందిన ఫిరోజ్ గౌలమ్ దాతృత్వానికి యూఏఈ ప్రభుత్వం ఫిదా అయ్యింది. యూఏఈలో బంగారం వ్యాపారం చేస్తున్న ఫిరోజ్..సమాజంలో నిరాదరణకు గురైన వారికి చేస్తున్న విశేష సేవలను గుర్తించి సత్కరించింది. పలువురు పోలీసులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫిరోజ్ కు ప్రశంస పత్రం అందజేసి గౌరవించారు. 2008 నుంచి ఫిరోజ్ యూఏలో బంగారు అభరణాల వ్యాపారం చేస్తున్నారు. పలు కారణాలతో శిక్షలు అనుభవిస్తూ జరిమానాలు కట్టలేక జైళ్లలోనే మగ్గుతున్న వారికి ఆయన ఎంతగానో సాయం చేశారు. విస్మరించబడిన సమాజం(ఫర్గాటన్ సొసైటీ) పేరుతో కొన్ని సంస్థలతో కలిసి ఆయన పలువురు ఖైదీలకు విముక్తి కలిగించారు. ఇందుకోసం ఖైదీలు బకాయిపడ్డ లక్షలాది డబ్బును చెల్లించారు. అంతేకాదు..తన దాతృత్వంతో జైలు నుంచి విడుదైన ప్రవాస ఖైదీలు..ఆ తర్వాత క్షేమంగా తమ దేశం చేరుకునేలా ఫిరోజ్ బాధ్యత తీసుకునేవాడు. వారికి ఉచితంగా విమాన టికెట్లు అందించి వారి స్వదేశానికి పింపించేవారు. ఫిరోజ్ దాతృత్వాన్ని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం అతని సేవలకు సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వ్యాపారి ఫిరోజ్..సమాజానికి తాను చేస్తున్న సాయాన్ని యూఏఈ ప్రభుత్వం గుర్తించి తనను గౌరవించటం పట్ల పాలకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. యూఏఈ ప్రభుత్వం తన సేవలను గుర్తించటం పట్ల గర్వంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







