తెలంగాణలో కొత్తగా 2,474 కరోనా పాజిటివ్ కేసులు
- August 22, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిని 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. తాజాగా ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 744 కు చేరింది. కొత్తగా 1768 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,735 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం వెల్లడించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 77.29 శాతంగా ఉందని తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ 477, రంగారెడ్డి 201, నిజామాబాద్‌లో 153 నమోదయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







