సాదర ఆహ్వానం-సమగ్ర ప్రకటన-7వ ప్రపంచ తెలుగు సాహితీసదస్సు

- August 22, 2020 , by Maagulf
సాదర ఆహ్వానం-సమగ్ర ప్రకటన-7వ ప్రపంచ తెలుగు సాహితీసదస్సు

రాబోయే అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 24 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్  నుంచి అమెరికా దాకా జరుగుతున్న ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకీ, పండితులకీ, రచయితలకీ, వక్తలకీ సాదర ఆహ్వానంతో పాటు మీరు సకాలంగా స్పందించవలసిన వివరాలతో సమగ్ర ప్రకటన ఇందుతో జతపరుస్తున్నాం.

జూమ్ వీడియో లో జరుగుతున్న ఈ తెలుగు సాహితీ సదస్సు యూ ట్యూబ్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల ద్వారా  ప్రపంచం లో ఏ దేశం నుంచి అయినా ప్రత్యక్ష ప్రసారం లో చూసి, తమ అభిప్రాయాలని అప్పటికప్పుడు తెలియజేయవచ్చును.  

గత కొద్ది రోజుల క్రితం విడుదల అయిన మా సంక్షిప్త ప్రకటనకీ, అనేక మాధ్యమాలలో జరిగిన వీడియో ప్రసారానికీ  ప్రపంచవ్యాప్తంగా  వక్తల నుంచే కాక, ప్రముఖ సాహితీవేత్తల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ నేపధ్యం లో లబ్ఢప్రతిష్టులైన రచయితలకీ, సాహితీవేత్తలకీ, వక్తలకీ ఈ సాదర ఆహ్వానాన్ని వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించి, మీ ప్రసంగ వ్యాసం మకుటాన్నీ, సంక్షిప్త ప్రసంగవ్యాసాన్నీ మాకు సెప్టెంబర్ 10, 2020 లోగా పంపించి సహకరించమని కోరుతున్నాం. ఎందరో మహానుభావులు....వారిని ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, సగౌరవంగా ఆహ్వానించడం సముచితమూ, మా కర్తవ్యమూ అయినా 24 గంటలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో అందరిలో కొందరిని అయినా ఎంపిక చేసి ఆహ్వానించడం అత్యంత క్లిష్టమైన పని అని మీకు తెలిసినదే! ఈ సదస్సులో పాల్గొనడం ప్రతిష్టాత్మకమైనది అని భావించే ప్రముఖ రచయితలూ, సాహితీవేత్తలూ, ఔత్సాహికులనీ ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా పరిగణించి ఈ క్రింది వారిని సంప్రదించమని కోరుతున్నాం.


Last day to receive proposals to participate is September 10, 2020. No Exceptions please.

 భవదీయులు,

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు

E-mail: [email protected];  వాట్సాప్: + 1 832 594 9054

కవుటూరు రత్న కుమార్ (సింగపూర్); రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్); రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), చిత్తర్వు శ్రీకాంత్ (దుబాయ్); వంశీ రామరాజు (భారత దేశం), శాయి రాచకొండ (హ్యూస్టన్, అమెరికా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com