కోమాలోకి కిమ్.. అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న లేడి హిట్లర్
- August 24, 2020
ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్ళారన్న వార్తలు ఒక్కసారిగా ప్రపంచ మీడియాలో గుప్పుమన్నాయి. ఆయన స్థానంలో కిమ్ యో జోంగ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు దక్షిణ కొరియా అధికారి చాంగ్ సాంగ్ మిన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కిమ్ యో జోంగ్‌కు కొన్ని అధికారులు కట్టబెట్టారని పలు వార్తలు మీడియాలో ప్రచారం అయిన సంగతి తెలిసిందే. కిమ్ చూసుకునే విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైనిక రంగాలతో పాటు అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాల లాంటి ముఖ్యమైనవన్నీ కూడా ఇకపై కిమ్ యో జాంగ్ పర్యవేక్షిస్తారని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.
”కిమ్ కోమాలో ఉన్నారని అనుకుంటున్నా. ఆయన ఈ ఏడాది కనిపించింది చాలా తక్కువ. అందుకే ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ రెడీగా ఉన్నారని దాని కోసం రంగం సిద్ధం చేస్తున్నారని ” చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కాగా, గతంలో కూడా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇలాంటి పుకార్లు ఎన్నో షికారు చేశాయి. కొంతమంది కిమ్ చనిపోయారని అంటే.. మరికొందరు అతడి ఆరోగ్యం క్షీణించిందని.. ఇంకొందరు ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని అన్నారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా కోమాలోకి వెళ్లిపోయారని పక్క దేశం అధికారి చెబుతున్నాడు. ఇదంతా కూడా నిజమేనా.? లేక కిమ్ ప్రపంచదేశాలను తప్పుదోవ పట్టించడానికి ఏదైనా ప్లాన్ వేశాడా.? అన్నది తెలియాలి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







