ఇంజనీరింగ్‌ ఉద్యోగాల లోకలైజేషన్‌

- August 24, 2020 , by Maagulf
ఇంజనీరింగ్‌ ఉద్యోగాల లోకలైజేషన్‌

రియాద్‌: కింగ్డమ్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాల్ని లోకలైజేషన్‌ చేసే దిశగా మినిస్ట్రీ డెసిషన్‌ వెలువడింది. మినిస్ట్రీ ఆఫ్‌ హ్యామన్‌ రిసోర్సెస్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ విడుదల చేసిన నిర్ణయం ద్వారా అన్ని ప్రైవేట్‌ సెక్టార్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లోనూ దీన్ని వర్తింపజేస్తారు. 20 శాతం లోకలైజేషన్‌ మెజర్‌ ద్వారా, గ్రాడ్యుయేట్స్‌కి సౌదీ అరేబియాలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి. మినిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన మ్యాన్యువల్‌ అందుబాటులో వుంటుంది. లేబర్‌ మరియు సోషల్‌ డిపార్ట్‌మెంట్‌ మినిస్టర్‌ అహ్మద్‌ బిన్‌ సులేమాన్‌ అల్‌ రాజి ఈ మేరకు వివరాల్ని వెల్లడిస్తూ, తాజా నిర్ణయంతో కింగ్డమ్ అభివృద్ధిలో మరింతగా దూసుకుపోతుందని చెప్పారు. కాగా, ఫార్మసీ అలాగే డెంటిస్ట్రీ విభాగాల్లోనూ లోకలైజేషన్‌కి ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పలు ప్రొఫెషన్స్‌లో లోకలైజేషన్‌ ద్వారా స్థానిక యువతకు అవకాశాలు పెరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com