భారత్ లో 58వేలు దాటిన కరోనా మరణాలు
- August 25, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగూతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కు పెరిగింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో కొత్తగా 848 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 58,390కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 24, 04, 585గా ఉంది. దేశంలో ప్రస్తుతం 7,04,348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3.5 కోట్ల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఒకే రోజు 9.25లక్షలకుపైగా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇందుకు టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







