ఆన్ లైన్ ద్వారా యూఏఈ ఎంట్రీ పర్మిట్ దరఖాస్తులకు అవకాశం
- August 25, 2020
యూఏఈ:యూఏఈ వెళ్లాలనుకుంటున్న వారికి సులభంగా అనుమతి పొందేలా యూఏఈ పౌర గుర్తింపు అధికార విభాగం చర్యలు చేపట్టింది. ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తులను సులభతరం చేస్తూ ఆన్ లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీఏ అధికార వెబ్ సైట్ http://ica.gov.aeద్వారాగానీ, లేదంటే స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించి, ఈ మెయిల్ ద్వారా ఎంట్రీ పర్మిట్ పొందవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే..దరఖాస్తు సమయంలో జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని కూడా సూచించింది. ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ తో పాటు ఐడీ కార్డు నెంబర్, ఎక్స్ పైరీ డేట్ లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దరఖాస్త ఫాంలో పొందుపరిచే వివరాల ఆధారంగా వారి దరఖాస్తులను పరిశీలించి అనుమతి ఇవ్వాలా, తిరస్కరించాలో ఐసీఏ నిర్ణయిస్తుంది.

తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







