డ్రాగన్ కు షాక్ ఇచ్చిన ప్రపంచదేశాలు.. అందుకే టాపిక్ డైవర్ట్ చేస్తున్న చైనా
- August 26, 2020
న్యూఢిల్లీ: కరోనా విషయంలో చైనా అనుసరించిన వైఖరికి ప్రపంచదేశాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి. ఎలాగైనా చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే కసితో జపాన్, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, సౌత్ కొరియా లాంటి మరిన్ని దేశాలు తమ దేశాలకు చెందిన అన్ని తరహా కంపెనీలను, పెట్టుబడులను చైనా నుంచి బయటకు రావాలని పిలుపునిస్తున్నాయి. జపాన్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి.. చైనా నుంచి వెనక్కి వచ్చే తమ అలా దేశానికి చెందిన కంపెనీల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించింది.
దీంతో తమ దేశాల ప్రభుత్వం పిలుపుమేరకు కంపెనీలన్నీ చైనాలో ఉన్న కంపెనీలు, బ్రాంచీలు, ఫ్యాక్టరీలు మరియు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకి చెందిన ఆపిల్ కంపెనీ 1 బిలియన్ డాలర్ల మానిఫ్యాక్చరింగ్ యూనిట్ భారత్లో పెడుతున్నామని ప్రకటించింది. తాజాగా శాంసంగ్ తన మేజర్ స్మార్ట్ ఫోన్ విభాగాన్ని మొత్తం ఇండియాకి తరలించాలని నిర్ణయించింది. దీని ద్వారా 40 బిలియన్ డాలర్ల వస్తువుల ఉత్పత్తి జరగనుంది. అలాగే మైక్రోమాక్స్ 500 కోట్ల రూపాయల మానిఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (అర్ అండ్ డీ) విభాగాన్ని భారత్కు తరలిస్తుంది. అలాగే వీటికి అనుబంధంగా ఉండే చిన్న చిన్న కంపెనీలతో పాటు కొన్ని కంపెనీల అసెంబుల్ యూనిట్స్ కూడా భారత్కు వస్తున్నాయి.
దీంతో చైనాలో ప్రస్తుతం అర్ధిక సంక్షోభం ఏర్పడింది. దీంతో పాటు భారత్ లాంటి అనేక దేశాలు చైనాకు ఆహార పదార్థాలను ఎగుమతి చేసేవి. కరోనా కారణంగా ఆ దేశాలన్నీ చైనాకు ఎగుమతులను అపేయడంతో ఇప్పటికే అక్కడ తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. రోజురోజుకు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా కుప్పకూలిపోతుంది. అందుకే చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచడం ద్వారా తమ దేశ ప్రజలను ఈ విషయం నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుందని నిపుణులు అంటున్నారు...!!
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







