డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
- August 26, 2020
న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. తాజాగా ఆయన తీవ్ర (డీప్)కోమాలోకి వెళ్లిపోయారని, వెంటిలేటర్ మద్దతుతో కృత్రిమ శ్వాస అందజేస్తున్నామని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ దవాఖాన బుధవారం తెలిపింది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్ దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ప్రణబ్‌కు చికిత్స అందజేస్తున్నామని, నిన్నటి నుంచి ఆయన మూత్రపిండాలు కూడా క్షీణిస్తున్నట్లు కనబడుతోందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 10న ప్రణబ్‌కు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







